Share News

ఉరుసు ఉత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:25 AM

స్థానిక బీబీ జైనబ్బీ దర్గా ఉరుసు ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఉరుసు ఉత్సవాలు ప్రారంభం
గంధం ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

ఉరవకొండ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): స్థానిక బీబీ జైనబ్బీ దర్గా ఉరుసు ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దర్గాలో అమ్మవారి సమాధిని వివిధ పూలతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా గంధం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అల్లపరెడ్డి ఇంటి నుంచి గంధం బయలుదేరి మేళతాళాల మధ్య పట్టణంలోని వీధుల్లో ఊరేగిస్తూ.. తెల్లవారుజామున దర్గాకు చేర్చారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 12:25 AM