Share News

నిరుపయోగంగా గోదాము

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:02 AM

వ్యవసాయశాఖ డివిజన పరిధిలోని ఐదు మండలాల రైతుల సౌకర్యార్థం 2018 టీడీపీ ప్రభు త్వం స్థానిక రెవెన్యూ కార్యాలయం వెనుక భాగంలో గోదామును ఏర్పాటు చేసింది

నిరుపయోగంగా గోదాము
గుత్తిలో వృథాగా ఉన్న వ్యవసాయ గోదాము

గుత్తి,డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): వ్యవసాయశాఖ డివిజన పరిధిలోని ఐదు మండలాల రైతుల సౌకర్యార్థం 2018 టీడీపీ ప్రభు త్వం స్థానిక రెవెన్యూ కార్యాలయం వెనుక భాగంలో గోదామును ఏర్పాటు చేసింది. సివిల్‌ సప్లై గోదాముల పక్కనే దీన్ని రూ . 17 లక్షలతో నాడు నిర్మించింది. అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల .. ఆ గోదాముకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయలేదు. ఈ గోదాముకు కోర్టు ప్రాంగణం నుంచి లారీలు వెళ్లేందుకు అనుమతులు లేవు. ఇక కర్నూలు వైపు నుంచి నేరుగా సివిల్‌ సప్లై గోదాము నుంచి వచ్చేందుకు కూడా దారి లేదు. దీంతో సరైన దారి లేక.. ఈ గోదాము వృథాగా పడి ఉంది. దీంతో అక్కడ కంపచెట్లు భారీ గా పెరిగాయి. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు ఆ గోదామును వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనిపై ఏడీఈ వెంకటరాముడును వివరణ కోరగా... గోదాము రస్తా విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని, త్వరలోనే దాన్ని వినియోగంలోకి తెస్తామని అన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 12:02 AM