Share News

అందని గోకులం బిల్లులు

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:36 AM

గోకులం పథకం కింద మొదటివిడతగా మండలంలో 32 మంది పాడి రైతులకు షెడ్లు మంజూరయ్యాయి. షెడ్ల నిర్మాణ పనులు పూర్తిచేయడమే ఆలస్యం వెంటనే మీకు బిల్లులు చెల్లిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు చకచకా షెడ్ల నిర్మాణ పనులు పూర్తిచేశారు.

అందని గోకులం బిల్లులు
గోకులం షెడ్డును పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్‌)

యాడికి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): గోకులం పథకం కింద మొదటివిడతగా మండలంలో 32 మంది పాడి రైతులకు షెడ్లు మంజూరయ్యాయి. షెడ్ల నిర్మాణ పనులు పూర్తిచేయడమే ఆలస్యం వెంటనే మీకు బిల్లులు చెల్లిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు చకచకా షెడ్ల నిర్మాణ పనులు పూర్తిచేశారు. కొందరు అప్పులు చేసి.. మరీ షెడ్లను నిర్మించుకున్నారు. సంక్రాంతి పండుగ రోజున అధికారులు, నాయకులు వెళ్లి గోకులం ఆయా షెడ్లను అట్టహాసంగా ప్రారంభించారు. అయితే ఆ 32 మందిలో 22 మందికి బిల్లులు మంజూరు కాగా.. 10 మందికి మాత్రం నేటికీ బిల్లులు మంజూరు కాకపోవడంతో వారు లబోదిబోమంటున్నారు. అధికారులు చర్యలు చేపట్టి ఆ బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. దీనిపై ఉపాధిహామి పథకం ఏపీఓ చిన్నమద్దిలేటిని వివరణ కోరగా.. ‘ మండలంలో పదిమంది గోకులం షెడ్ల లబ్ధిదారుల బిల్లులు రిజెక్ట్‌ అయ్యాయి. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. వీటిని అన్నింటిని మరళా అప్‌లోడ్‌ చేశాము. నిధులు విడుదల అయిన వెంటనే బిల్లులు మంజూరు అవుతాయి. సమస్య పరిష్కారం మా పరిధిలో లేదు. లబ్ధిదారులకు వీలైనంత తొందరగా బిల్లులు మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టాం.’ అని తెలిపారు.

Updated Date - Sep 22 , 2025 | 12:36 AM