Share News

Unfinished అసంపూర్తిగా నాడు-నేడు పనులు

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:07 AM

గత వైసీపీ ప్రభుత్వం మండలంలోని పలు పాఠశాలల్లో రెండో విడతలో నాడు-నేడు పథకం కింద చేపట్టిన పనులు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి.

Unfinished  అసంపూర్తిగా నాడు-నేడు పనులు
దర్గా హొన్నూరులో అర్ధంతరంగా ఆగిపోయిన హైస్కూల్‌ తరగతి గదుల నిర్మాణం

బొమ్మనహాళ్‌, జూన 5(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం మండలంలోని పలు పాఠశాలల్లో రెండో విడతలో నాడు-నేడు పథకం కింద చేపట్టిన పనులు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. మండలంలో రెండో విడతలో 39 పాఠశాలల్లో రూ. 7.58 కోట్లతో వైసీపీ ప్రభుత్వం పనులకు శ్రీకారం చుట్టింది. అనేక పాఠశాలల్లో ఉన్న తరగతి గదులను, మరుగుదొడ్లను కూల్చివేసింది. నిర్మాణ పనులను ప్రారంభించింది. అయితే పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయకపోవడంతో మరుగుదొడ్లు, విద్యుత, తాగునీటి వసతి, ఫీర్నీచర్‌, మరమ్మతులు, తరగతి గదులు, ప్రహరీలు, గ్రీనచాక్‌ బోర్డులు తదితర పనులు ఆగిపోయాయి. ఇలా పనులు ఆగిపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఈ పనుల పూర్తి చేసేలా ప్రస్తుత ప్రభుత్వమూ చర్యలు తీసుకోకపోవడం... మరో వారం పాఠశాలలు పునః ప్రారంభం అవుతుండటంతో వారు అయోమయంలో పడ్డారు. కనీసం పాఠశాలలు ప్రారంభించేనాటికి మంచినీటి, మరుగుదొడ్ల సౌకర్యాలైనా కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jun 06 , 2025 | 12:07 AM