జమకాని అన్నదాత సుఖీభవ నగదు
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:25 AM
అన్నదాత సుఖీభవ పథకం నగదు తమకు జమకాలేదని మండలంలోని పలువురు రైతులు వాపోతున్నారు.
గుత్తి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ పథకం నగదు తమకు జమకాలేదని మండలంలోని పలువురు రైతులు వాపోతున్నారు. గ్రామ సచివాలయాల్లో వారు సంప్రదించగా.. మండల వ్యవసాయ కార్యాలయానికి వెళ్లి.. ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. దీంతో మండలంలోని రైతులు సోమవారం వ్యవసాయ కార్యాలయానికి వచ్చారు. తమకు పీఎం కిసాన యోజక కింద రూ. 2వేలు జమ అయ్యిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ. 5 వేలు జమకాలేదని వాపోయారు. దీనిపై వ్యవసాయ కార్యాలయంలో అధికారులను సంప్రదించామన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం వర్తిస్తుందని, రైతులందరికి న్యాయం జరిగేలా చర్యలు చేపడుతామని మండల వ్యవసాయ అధికారి ముస్తాక్ ఆహ్మద్ హామీ ఇచ్చారన్నారు.