యథేచ్ఛగా ఇసుక తరలింపు
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:06 AM
మండలంలోని కొంత మంది టీడీపీ, వైసీపీ నాయకులు కలిసి ఇసుక అక్రమ వ్యాపారానికి తెరలేపారు. రోజుకు రూ లక్షలు గడిస్తున్నారు.
విడపనకల్లు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొంత మంది టీడీపీ, వైసీపీ నాయకులు కలిసి ఇసుక అక్రమ వ్యాపారానికి తెరలేపారు. రోజుకు రూ లక్షలు గడిస్తున్నారు. బొమ్మనహాలు మండలం బొల్లనగుడ్డం, కందేపల్లి, కణేకల్లు మండలంలోని పలు ప్రాంతాల నుంచి రోజూ పగలు - రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుకను వందలాది ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఈ ఇసుక ట్రాక్టర్లు పా ల్తూరు, కరకముక్కల మీదుగా మండలానికి చేరుకుంటున్నాయి. ఏ ఒక్క ట్రాక్టర్‌కూ నం బరు ప్లేటు ఉండదు. మండల అధికారుల క ళ్లు ఎదుటే ఇసుకను అక్రమంగా రవాణా చే స్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇ క్కడి నుంచి వివిధ గ్రామాలకు పక్కనే ఉన్న కర్ణాటకకు ఆ ఇసుకను తరలిస్తున్నారు.