TTD నిరుపయోగంగా టీటీడీ కల్యాణ మండపం
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:46 PM
స్థానిక పుట్టపర్తి రహదారి సమీపంలోని తిరుమల తిరుపతి కల్యాణ మండపం దాదాపు నాలుగు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంది.

కొత్తచెరువు, మార్చి 16(ఆంధ్రజ్యోతి): స్థానిక పుట్టపర్తి రహదారి సమీపంలోని తిరుమల తిరుపతి కల్యాణ మండపం దాదాపు నాలుగు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంది. దీంతో 2000 ఆగస్టున ప్రారంభించారు. దీన్ని రెండేళ్లకు ఒక సారి లీజ్‌కు ఇచ్చేవారు. అయితే లీజ్‌కు తీసుకున్నవారు దాని నిర్వహణ గురించి ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో .. ఆ భవనం 20 సంవత్సరాలకే శిథిలావస్థకు చేరుకుంది. నాలుగేళ్ల నుంచి ఎవరూ లీజ్‌కు కూడా తీసుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం ఆ భవనం నిరుపయోగంగా మారింది. పోలీ్‌సస్టేషనకు సమీపంలో ఉన్న ఈ భవనం నేడు మందుబాబులు అడ్డాగా మారింది. పోలీ్‌సస్టేషనకు సమీపంలోనే విచ్చలవిడిగా టీటీడీలో మద్యం సేవిస్తున్నా.. పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఉదయం నుంచి రాత్రి దాకా యువకులు, వృద్ధులు అక్కడే మందు తాగి.. అక్కడే సేద తీరి.. మరీ వెళ్తున్నారు. మరికొందరు గుంపులు గుంపులుగా చేరి మద్యంతో పాటు గంజాయిను సేవిస్తూ అటు వైపు వెళ్లే వారిని బండబూతులు తిడుతున్నారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేయినా.. స్పందన శూన్యం.