Share News

పోలీసు అమరవీరులకు నివాళి

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:12 AM

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పట్టణంలో పోలీసులు, విద్యార్థులు మంగళవారం నివాళులర్పించారు.

పోలీసు అమరవీరులకు నివాళి
మానవహారంగా ఏర్పడ్డ పోలీసులు, విద్యార్థులు

ఉరవకొండ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పట్టణంలో పోలీసులు, విద్యార్థులు మంగళవారం నివాళులర్పించారు. మొదట స్థానిక పోలీసు స్టేషన నుంచి విద్యార్థులతో కలిసి టవర్‌క్లాక్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. అలాగే వజ్రకరూరులో పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో సీఐ మహానంది, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 12:12 AM