Share News

Janasena జనసేన వలంటీర్లకు సన్మానం

ABN , Publish Date - May 18 , 2025 | 12:12 AM

జనసేనక్రియాశీలక సభ్యత్వ నమో దు కార్యక్రమంలో పాల్గొన్న వలంటీర్లను స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం సన్మానించారు.

 Janasena జనసేన వలంటీర్లకు సన్మానం
వలంటీర్లకు కిట్లను పంపిణీ చేస్తున్న చిలకం

ధర్మవరం, మే 17(ఆంధ్రజ్యోతి): జనసేనక్రియాశీలక సభ్యత్వ నమో దు కార్యక్రమంలో పాల్గొన్న వలంటీర్లను స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం సన్మానించారు. వారికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి సభ్యత్వ కిట్లను అందజేశారు. సభ్యత్వంతో కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు, భరోసా ఉంటాయన్నారు. ఈ సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయితే వారి కుటుంబాలకు పరిహారంగా రూ.5 లక్షలు బీమా వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర పార్టీ కార్యాలయ అబ్జర్వర్‌ జ్ఞానేశ్వర్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు అడ్డగిరి శ్యాంకుమార్‌, నాయకుడు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:12 AM