వణికిస్తున్న విష జ్వరాలు
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:43 PM
వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ప్రస్తుతం విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ ఇంటిలో చూసినా ఒకరు.. ఇద్దరు.. జ్వరాలతో బాధపడుతున్నారు
యాడికి, ఆగస్టు28(ఆంధ్రజ్యోతి): వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ప్రస్తుతం విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ ఇంటిలో చూసినా ఒకరు.. ఇద్దరు.. జ్వరాలతో బాధపడుతున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ వారు సుమారు 150 దాకా ఉంటే అందులో 50 శాతం మంది జ్వర బాధితులే. అలాగే రాయలచెరువు ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ క్లినిక్‌లూ జ్వర బాధితులతో కిటకిటలాతున్నాయి. ప్రైవేట్ క్లినిక్‌ల్లో రక్తపరీక్షల పేరుతో దోపీడీ చేస్తున్నారు. దీనిపై యాడికి ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ పరమేశ్వర్ మాట్లాడుతూ.. వాతావరణంలో మార్పుల కారణంగా జ్వరాలు వస్తున్నాయని, అందరూ కాచివడబోసిన గోరు వెచ్చని నీటిని తాగాలని తెలిపారు.