ముళ్లకంపల్లో ట్రాన్సఫార్మర్
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:24 AM
మండలంలోని కల్లుదేవనహాళ్లి గ్రామ సమీపంలో ట్రాన్సఫార్మర్ చుట్టూ భారీగా ముళ్లకంపలు పెరిగాయి.
బొమ్మనహాళ్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కల్లుదేవనహాళ్లి గ్రామ సమీపంలో ట్రాన్సఫార్మర్ చుట్టూ భారీగా ముళ్లకంపలు పెరిగాయి. దానికి సమీపంలోని ఓ విద్యుత స్తంభానికి పిచ్చి తీగలు అల్లుకున్నాయి. వర్షాలు పడుతున్న ఈ తరుణంలో ప్రమాదం జరిగే అవకాశముందని ఆ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ముళ్లచెట్లను, తీగలను తొలగించాలని లైనమనకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ గ్రామస్థులు వాపోతున్నారు. దీనిపై బొమ్మనహాళ్ ఏఈఈ లక్ష్మిరెడ్డిని వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదని, ట్రాన్సఫార్మర్ వద్ద ముళ్లకంపలు తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.