Share News

Traffic తిరువీధుల్లో ట్రాఫిక్‌ అస్తవ్యస్తం

ABN , Publish Date - May 18 , 2025 | 11:07 PM

ప ట్టణంలోని తిరువీధులు శుక్ర, శని, ఆదివారాలు వచ్చాయం టే చాలు ట్రాఫిక్‌తో అస్తవ్యస్తంగా మారుతున్నాయి. హిం దూపూర్‌ క్రాస్‌ నుంచి కోనేరు వరకు ట్రాఫిక్‌ స్తంభి స్తోంది.

Traffic   తిరువీధుల్లో ట్రాఫిక్‌ అస్తవ్యస్తం
పడమటి గోపురం వద్ద ట్రాఫిక్‌ జామ్‌ (ఫైల్‌)

కదిరి, మే 18(ఆంధ్రజ్యోతి): ప ట్టణంలోని తిరువీధులు శుక్ర, శని, ఆదివారాలు వచ్చాయం టే చాలు ట్రాఫిక్‌తో అస్తవ్యస్తంగా మారుతున్నాయి. హిం దూపూర్‌ క్రాస్‌ నుంచి కోనేరు వరకు ట్రాఫిక్‌ స్తంభి స్తోంది. కనీసం అంబులెన్స కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. తిరువీధుల్లోనే ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ నివాసముండటంతో అక్కడికి వచ్చే ప్రజలు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ వీధులో ట్రాఫిక్‌ను నియంత్రించాల్సి పోలీస్‌ అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్‌ నియంత్రనను గాలికొద్దిలేశారు. దీంతో గంటలకొద్ది ట్రాఫిక్‌ జాం అవుతోంది. ముఖ్యమంగా కర్ణాటక నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలు ఎక్కడ పెట్టుకోవాలో సూచించడానికి ఇటు పోలీసులు కానీ, అటు ఆలయ సిబ్బం ది కానీ చొరవ చూపడంలేదు. దీంతో తిరువీధుల్లో ఎక్కడబడితే అక్కడ వాహనాలు ఆపివేస్తున్నారు. చివరకు దేవళం బజారులో కూడా భక్తులు వెళ్లడానికి వీలులేకుండా పోతోంది. ఇప్పటికైనా పోలీసులు, దేవదాయ అధికారులు చర్యలు తీసుకుని, ట్రాఫిక్‌ ను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - May 18 , 2025 | 11:07 PM