Share News

ట్రాక్టర్లు ఇచ్చారు.. ట్రాలీలు మరిచారు

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:11 AM

పల్లెల్లో చెత్త సేకరణకు ప్రభుత్వం పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేసినా, వాటికి ట్రాలీ లు ఇవ్వకపోవడంతో అవి నిరుపయోగంగా మారా యి.

 ట్రాక్టర్లు ఇచ్చారు.. ట్రాలీలు మరిచారు
హోతూరులో పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ట్రాక్టర్‌

ఉరవకొండ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో చెత్త సేకరణకు ప్రభుత్వం పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేసినా, వాటికి ట్రాలీ లు ఇవ్వకపోవడంతో అవి నిరుపయోగంగా మారా యి. జిల్లాలో 577 పంచాయతీలు ఉండగా, 552 గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. రోజూ ఇళ్ల నుంచి చెత్త సేకరణకు అద్దె ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. వీటి కి నెలకు రూ.10వేలు చెల్లించాల్సి రావడంతో చిన్న పంచాయతీలకు ఆర్థికంగా భారంగా మారింది. ఈ సమస్య పరిష్కారానికి స్వర్ణాంధ్ర కార్పొరేషన నిధులతో ట్రాక్టర్లను విడతల వారిగా ప్రభుత్వం మంజూరు చేసిం ది. ఒక్కొక్క వాహనానికి రూ.6.01 లక్షలు చెల్లించింది. అయితే వాటికి ట్రాలీలు ఇవ్వకపోవడంతో ఆ ట్రాక్టర్లు నిరుపయోగంగా ఉండిపోయాయి. కొన్ని నెలలుగా ట్రాక్టర్లు వినియోగించకపోవడంతో వాటిలోని బ్యాటరీలు దెబ్బతినే అవకాశముందని, గ్రామకార్యదర్శులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. దీనిపై జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడును వివరణ కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ట్రాక్టర్లు ట్రాలీ విషయంపై ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 12:11 AM