Toli Adugu ప్రజాభిష్టమే పాలనకు దిక్సూచి: టీడీపీ
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:44 PM
ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వం పనిచేస్తుందని తెలుగుదేశం నాయకులు అన్నారు. బుధవారం హిందూపురం మండలంలోని కొటిపిలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు.
హిందూపురం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వం పనిచేస్తుందని తెలుగుదేశం నాయకులు అన్నారు. బుధవారం హిందూపురం మండలంలోని కొటిపిలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. దీనికి మార్కెట్‌యార్డ్ చైర్మన అశ్వర్థనారాయణరెడ్డి, టీడీపీ వాణిజ్యవిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణాచల్‌రెడ్డి, వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్ బేవనహళ్లి ఆనంద్, కన్వీనర్ రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతున్న తరుణంలో చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటే నెరవేరుస్తున్నారన్నారు. మహిళలకు ఈనెల 15నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. చదువుకునే ప్రతి బిడ్డకు తల్లికి వందనం అందిందన్నారు. అన్నదాత సుఖీభవ కింద అర్హులైన ప్రతి రైతుకు రూ.7వేలు జమ అయ్యాయన్నారు. మూడు సిలెండర్లు ఏడాదికి ఉచితంగా ఇస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రతి పల్లెకు సీసీరోడ్డు నిర్మాణం అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉమాశంకర్‌రెడ్డి, టీడీపీ మండల కోఆర్డినేటర్ మంజునాథ్, రామక్రిష్ణారెడ్డి, హనుమంతు, శ్రీరామప్ప, రషీద్, అంజినరెడ్డి, రామక్రిష్ణ, చిక్కీరప్ప, ఆదినారాయణ, రామగిరి సూరీ, అంజినేయులు, చిన్నారెడ్డి పాల్గొన్నారు.