Share News

కంబదూరుకు తిరుపతి రైలు..!

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:58 PM

కంబదూరు మండలంలోని కదిరి దేవరపల్లి రైల్వే స్టేషన వరకు నడుస్తున్న తిరుపతి - కదిరిదేవరపల్లి ప్యాసింజర్‌ రైలును కంబదూరు మీదుగా దొడ్డహళ్లి వరకు నడపాలనే ప్రతిపాదన ఉంది.

కంబదూరుకు తిరుపతి రైలు..!
కంబదూరు స్టేషనలో ఉన్న రైలు

కళ్యాణదుర్గం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కంబదూరు మండలంలోని కదిరి దేవరపల్లి రైల్వే స్టేషన వరకు నడుస్తున్న తిరుపతి - కదిరిదేవరపల్లి ప్యాసింజర్‌ రైలును కంబదూరు మీదుగా దొడ్డహళ్లి వరకు నడపాలనే ప్రతిపాదన ఉంది. ఇటీవల ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సోమన్న దృష్టికి ఈ ప్రతిపాదనను తీసుకెళ్లారు. దీంతో రైల్వే సేఫ్టీ అధికారులు కదిరిదేవరపల్లి నుంచి దొడ్డహళ్లి వరకు దాదాపు 20 కిలోమీటర్లకు పైగా రైల్వే ట్రాక్‌ను రైలు ఇంజిన సాయంతో శుక్రవారం పరిశీలించారు. రైల్వే ట్రాక్‌ పనులు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు కంబదూరుకు రైలు నడపడం లేదు. త్వరలోనే కంబదూరు వరకు రైలు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Sep 26 , 2025 | 11:58 PM