తిమ్మసముద్రానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:09 AM
తిమ్మసముద్రం పారిశ్రామికవాడగా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అనతి కాలంలోని రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు
కళ్యాణదుర్గంరూరల్, డిసెంబరు19(ఆంధ్రజ్యోతి): తిమ్మసముద్రం పారిశ్రామికవాడగా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అనతి కాలంలోని రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. తిమ్మసముద్రం ఇండసి్ట్రయల్ పార్కును మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మండలంలో ని తిమ్మసముద్రం పం చాయతి బాల వెంకటాపురం గ్రామంలో శుక్రవారం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి.. ప్రజ ల నుంచి అర్జీలు స్వీకరించారు. బాల వెంకటాపురంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్డీటీ ఎస్సీ కాలనీలోని నీటి సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రైతుల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. ప్రజాసమస్యలను నిర్లక్ష్యం చేస్తే.. సహించేది లేదని హెచ్చరించారు.