cpi టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలి
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:07 AM
జిల్లాలోని టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి.. వాటిని లబ్ధిదారులు అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ డిమాండ్ చేశారు.

కదిరిఅర్బన, మార్చి 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి.. వాటిని లబ్ధిదారులు అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని అండ్‌అండ్‌బీ భవనంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయకనే బ్యాంక్ రుణాలకు కంతులు కట్టాలని నోటీసులు పంపడం దారుణమన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, శ్రీశైలం బ్యాక్ వాటర్ వంద టీఎంసీలను జిల్లాకు కేటాయించాలని, హంద్రీనీవా కాలువలను వెడల్పు చేసి చెరువులకు పిల్ల కాలువల ద్వారా సాగునీరు అందించాలని, ఉపాధి పనులను 200 రోజులకు పెంచాలని కోరారు. ఈకార్యక్రమంలో కదిరిప్ప, రమణ, ఎల్‌వీ రమణ, ఏఐఎ్‌సఎఫ్ మహేంద్ర పాల్గొన్నారు.