Share News

ఇదీ పెద్దాసుపత్రికి వెళ్లే దారి

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:52 PM

ఓ చిన్నపాటి వాన వచ్చినా.. స్థానిక పెద్దాసుపత్రికి వెళ్లే దారి ఇలా తయారవుతోంది. మట్టిరోడ్డు కావడంతో మొత్తం బురదమయంగా మారుతోంది

ఇదీ పెద్దాసుపత్రికి వెళ్లే దారి
బురద మయంగా ఉన్న ఆస్పత్రి దారి (ఫైల్‌)

విడపనకల్లు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఓ చిన్నపాటి వాన వచ్చినా.. స్థానిక పెద్దాసుపత్రికి వెళ్లే దారి ఇలా తయారవుతోంది. మట్టిరోడ్డు కావడంతో మొత్తం బురదమయంగా మారుతోంది. రోడ్డు మొత్తం ఎగుడు దిగుడుగా.. గుంతలతో నిండి ఉండటంతో ద్విచక్రవాహనదారులు అనేక సార్లు కింద పడి .. అదే ఆస్పత్రిలో చేరుతున్నారు. కనీసం నడిచి వెళ్లడానికి కూడా వీలు లేని విధంగా ఉంది. ఈ రోడ్డుపై రోగులను తీసుకొని వెళ్లడానికి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు చూస్తున్నా.. పట్టించుకోకపోవడంపై వారు దుమ్మెత్తి పోస్తూ పోతున్నారు. ఇక్కడ సీసీ రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Sep 26 , 2025 | 11:52 PM