ఈ హెచఎం మాకొద్దు బాబోయ్
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:00 AM
మండలంలోని పూలకుంట అయ్యప్పనగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బషీర్ అహ్మద్‌ను విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యులు డిమాండ్ చేశారు
గుమ్మఘట్ట, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): మండలంలోని పూలకుంట అయ్యప్పనగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బషీర్ అహ్మద్‌ను విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆ పాఠశాల ఎదుట రోడ్డుపై బైఠాయించారు. మ ధ్యాహ్న భోజన సరుకులను ఏజెన్సీలకు సక్రమంగా ఇవ్వడం లేదని, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల దురుసుగా.. సైకోలా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. హెచఎంను తొలగించే దాకా తమ పిల్లలను పాఠశాలకు పం పబోమని గంటపాటు రాస్తారోకో చేశారు. పాఠశాలకు చేరుకున్న ఎస్‌ఐ ఈశ్వరయ్య విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి, ఎంఈఓ సోమశేఖర్ ఆ పాఠశాలకు చేరుకొని.. విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నత అధికారులకు పంపుతామన్నారు. కాగా, బషీర్‌అహ్మద్ గతంలో పనిచేసిన ప్రాంతాల్లోనూ ఇలాగే ప్రవర్తించి.. సస్పెండ్ అయ్యారు.