Share News

Liberation Day వెన్నుపోటు కాదిది.. విమోచన దినోత్సవం

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:08 AM

వెన్నుపోటు దినం కాదని.. వైసీపీ పాలన నుంచి దళితులకు నిజమైన విమోచన దినోత్సవం అని దళిత ఐక్యవేదిక నాయకులు ఎల్లిపాయల ఆనంద్‌ అన్నారు.

Liberation Day వెన్నుపోటు కాదిది.. విమోచన దినోత్సవం
గుంతకల్లులో దళిత ఐక్య వేదిక నాయకుల సంబరాలు

గుంతకల్లుటౌన, జూన 4(ఆంధ్రజ్యోతి): వెన్నుపోటు దినం కాదని.. వైసీపీ పాలన నుంచి దళితులకు నిజమైన విమోచన దినోత్సవం అని దళిత ఐక్యవేదిక నాయకులు ఎల్లిపాయల ఆనంద్‌ అన్నారు. పట్టణంలో దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకులు జింకల జగన్నాథ్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు తలారి వెంకటేష్‌, నాయకులు అరుణ్‌కుమార్‌, బబ్లు, రాజు, నవీన, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:08 AM