ఇరికించబోయి.. ఇరుక్కున్నారు
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:24 AM
మనస్పర్థలతో ఓ వ్యక్తిని గంజాయి కేసులో ఇరికించబోయి తామే ఇరుక్కు న్న సంఘటన సోమవారం పట్టణంలో జరిగింది. కేసు వివరాలను అర్బన సీఐ జయనాయక్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పట్టణానికి చెందిన ముత్రాసి హరికృష్ణకు, చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన గోళ్ల అఖిల్‌కు గతం నుంచి మనస్పర్థలున్నాయి.
రాయదుర్గంరూరల్, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): మనస్పర్థలతో ఓ వ్యక్తిని గంజాయి కేసులో ఇరికించబోయి తామే ఇరుక్కు న్న సంఘటన సోమవారం పట్టణంలో జరిగింది. కేసు వివరాలను అర్బన సీఐ జయనాయక్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పట్టణానికి చెందిన ముత్రాసి హరికృష్ణకు, చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన గోళ్ల అఖిల్‌కు గతం నుంచి మనస్పర్థలున్నాయి. దీంతో అఖిల్‌ను ఏదో ఒక కేసులో ఇరికించాలని హరికృష్ణ భా వించాడు. ఈక్రమంలోనే తన మామ ముత్రాసి అనిల్ సాయంతో శెట్టూరు మండలం చెలిమేపల్లిలో ముత్రాసి శంకర్ వద్ద అరకిలో గంజాయిని కొనుగోలు చేశాడు. వాటితో పాటు శ్రీగంధం చెక్కలను సేకరించారు. వీటిని తీసుకెళ్లి అఖిల్‌కు సంబంధించిన స్థలంలో ఉంచాలని భావించారు. అయితే వీరి వద్ద గంజాయి ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వారి ఇంటవద్దకు వెళ్లి తనిఖీ చేశారు. ఈక్రమంలోనే నిందితులైన ముత్రాసి హరికృష్ణ, ముత్రాసి అనిల్ మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 370 గ్రాములు గంజాయి, 214 గ్రాములు గంజాయి మొక్కలు, 10 కిలోల శ్రీగంధం చెక్కలు, రెండు సెల్‌ఫోనలు, ఒక ద్విచక్రవాహనం, ఒక కొడవలిను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి, రాయదుర్గం కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. కాగా గంజాయిని సాగుచేస్తున్న ముత్రాసి శంకర్ ఆచూకీ తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు.