ఆ సచివాలయానికి ఒక్కరే దిక్కు
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:43 PM
మండలం లోని శ్రీధరఘట్ట గ్రామ సచివాలయంలో ఎనిమిది మంది సిబ్బందికి గాను కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు
బొమ్మనహాళ్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): మండలం లోని శ్రీధరఘట్ట గ్రామ సచివాలయంలో ఎనిమిది మంది సిబ్బందికి గాను కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్నా సిబ్బందికి ఐదేళ్లు పూర్తి కావడంతో బదిలీపై వెళ్లారు. దీంతో ఒక్క మహిళ పోలీసు మాత్రమే మిగిలారు. శ్రీధర ఘట్ట గ్రామ సచివాలయం పరిధిలో ఉప్పరాళ్, ఎల్బీనగర్, గౌనూరు గ్రామాలు ఉన్నాయి. సచివాలయంలో సిబ్బంది కొరత వల్ల వీరంతా పనులు కాక.. ఇబ్బందులు పడుతున్నారు. ఉద్ధేహాళ్ పంచాయతీ కార్యదర్శి శివన్నకు శ్రీదరఘట్ట గ్రామ కార్యదర్శిగా ఇనచార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇక్కడ అందుబాటలో ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన సంతకాలు కోసం పలుమార్లు ఫోన చేసినా అందుబాటలోకి రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ సచివాలయంలో సిబ్బందిని నియమించాలని గ్రామస్థులు కోరుతున్నారు.