Share News

TEMPLE: భగవంతుడి సేవకు మించినది ఏదీలేదు

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:44 PM

భగవంతుని సేవకు మించిందేది లేదని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం పేట వెంకటరమణస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మనగా భగీరథ నవీనచంద్ర, తొమ్మిది మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

TEMPLE: భగవంతుడి సేవకు మించినది ఏదీలేదు
Scene of the oath taking ceremony with temple committee members

హిందూపురం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): భగవంతుని సేవకు మించిందేది లేదని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం పేట వెంకటరమణస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మనగా భగీరథ నవీనచంద్ర, తొమ్మిది మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆయన మాట్లాడుతూ పేట వెంకటరమణస్వామి ఆలయ కమిటీలో చైర్మన, సభ్యులుగా అవకాశం దక్కడం అదృష్టమన్నారు. భగవంతునిపట్ల సేవ చేయాలన్న సంకల్పం ఉన్నవారే నిజమైన భక్తులన్నారు. ఆలయ అధికారులు చైర్మన, కమిటీ సభ్యులు మాల, రాము, చిరంజీవి, వెంకటశ్రీనివాసులు, రామిరెడ్డి, వెంకటరత్నమ్మ, శ్రావణసంద్య, వెంకటాచలపతి, సరోజ, ఎక్స్‌అఫిషియోమెంబర్‌ రామాయణం చరణ్‌ ప్రమాణస్వీకారం చేశారు. వీరిని సత్కరించారు. ఆలయ ఈఓ నరసింహమూర్తి, మున్సిపల్‌ చైర్మన రమేష్‌, వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్‌ ఆనంద్‌, పట్టణ కన్వీనర్‌ వెంకటేశ, నాయకులు మంగేష్‌, రాఘవేంద్ర, జేపీకే రాము, మంజునాథ్‌, పరిమళ, అంజి, సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 11:44 PM