Share News

activists is final కార్యకర్తల అభీష్టమే ఫైనల్‌

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:24 AM

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకే మండల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులను ఎంపిక చేస్తామని పార్టీ పరిశీలకురాలు, రాష్ట్ర మహిళా సంఘం కార్యదర్శి స్వప్న స్పష్టం చేశారు.

activists is final కార్యకర్తల అభీష్టమే ఫైనల్‌
మాట్లాడుతున్న టీడీపీ పరిశీలకురాలు స్వప్న

గుమ్మఘట్ట, జూన 19(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకే మండల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులను ఎంపిక చేస్తామని పార్టీ పరిశీలకురాలు, రాష్ట్ర మహిళా సంఘం కార్యదర్శి స్వప్న స్పష్టం చేశారు. టీడీపీ మండల కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో గురువారం స్థానికంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి కార్యకర్తల సూచన మేరకే అధిష్టానానికి సిఫార్సు చేస్తామన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాయకులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. పదవులు రాకున్నా.. నిరుత్సాహ పడకుండా.. అందరూ సమన్వయంతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ గిరిమల్లప్ప, మార్కెట్‌యార్డ్‌ వైస్‌ ఛైర్మన దానవేంద్ర, బీటీ ప్రాజెక్ట్‌ కాలవ రాజు, టీడీపీ యూత అధ్యక్షుడు గోనబావి రమేష్‌, సర్పంచులు విజయలక్ష్మి, నాగరాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 12:25 AM