talent ఆదర్శ విద్యార్థినుల ప్రతిభ
ABN , Publish Date - May 06 , 2025 | 11:44 PM
రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ పోటీల్లో ఆదర్శ విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించారని ఆపాఠశాల ప్రిన్సిపాల్ రమే్‌షబాబు మంగళవారం ఓప్రకటనలో తెలియచేశారు.
పుట్టపర్తిరూరల్, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ పోటీల్లో ఆదర్శ విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించారని ఆపాఠశాల ప్రిన్సిపాల్ రమే్‌షబాబు మంగళవారం ఓప్రకటనలో తెలియచేశారు. ఈనెల 3, 4 తేదీల్లో ఒంగోలు జిల్లా మార్కాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ క్రీడా పోటీల్లో తమ పాఠశాల విద్యార్థినులు ఓంశ్రీ, వినీత, లేఖన, ఫర్హాన, శాలిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సంపాదించారన్నారు. ఇదే స్ఫూర్తితో జాతీయస్థాయి పోటీల్లో సైతం రాణించాలని ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ అజీంపాషా ఆకాంక్షించారు.