Share News

ఏడేళ్లుగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిరుపయోగం

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:48 PM

యాడికి గ్రామపంచాయతీకి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో 2017లో నాటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సుమారు రూ. కోటితో ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టించి గ్రామ పంచాయతీకి అప్పగించారు

ఏడేళ్లుగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిరుపయోగం
యాడికిలో నిరుపయోగంగా ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌

యాడికి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): యాడికి గ్రామపంచాయతీకి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో 2017లో నాటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సుమారు రూ. కోటితో ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టించి గ్రామ పంచాయతీకి అప్పగించారు. అయితే ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఒక గదిని తనకే కేటాయించాలని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. దీంతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ అద్దెకు ఇచ్చే ప్రక్రియ ఆగిపోయింది. నాటి నుంచి సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపకపోవడంతో ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిరుపయోగంగా పడి ఉంది. నెలకు రూ.2లక్షల వరకు అద్దెలు వచ్చే షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఇలా నిరుపయోగంగా ఉండటంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Sep 09 , 2025 | 11:48 PM