Share News

దేశ పురోగతిలో సొసైటీల పాత్ర కీలకం

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:07 AM

దేశ ఆర్థిక ప్రగతి, సమాజాభివృద్ధి, దేశ పురోగతిలో సొసైటీల పాత్ర కీలకమని జిల్లా సహకార శాఖ అధికారి (డీసీఓ) అరుణకుమారి పేర్కొన్నారు. స్థానిక రామ్‌నగర్‌లోని రాయలసీమ సహకార శిక్షణా కేంద్రంలో ఈ-ప్యాక్స్‌ (పీఏసీఎ్‌స)పై ఒక్కరోజు వర్క్‌షాప్‌ శుక్రవారం నిర్వహించా రు.

దేశ పురోగతిలో సొసైటీల పాత్ర కీలకం

దేశ పురోగతిలో సొసైటీల పాత్ర కీలకం

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): దేశ ఆర్థిక ప్రగతి, సమాజాభివృద్ధి, దేశ పురోగతిలో సొసైటీల పాత్ర కీలకమని జిల్లా సహకార శాఖ అధికారి (డీసీఓ) అరుణకుమారి పేర్కొన్నారు. స్థానిక రామ్‌నగర్‌లోని రాయలసీమ సహకార శిక్షణా కేంద్రంలో ఈ-ప్యాక్స్‌ (పీఏసీఎ్‌స)పై ఒక్కరోజు వర్క్‌షాప్‌ శుక్రవారం నిర్వహించా రు. ఈ సందర్భంగా డీసీఓ అరుణకుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాల (పీఏసీఎ్‌స)ను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయన్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, చిరువ్యాపారులు పరస్పర సహకారంతో సొసైటీలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఏడీసీసీ బ్యాంకు చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన నెట్టెం వెంకటేశు లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సొసైటీలను బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. సొసైటీలు అభివృద్ధి సాధిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. జిల్లా సహకార శాఖ డిప్యూటీ రిజిసా్ట్రర్‌ నారాయణస్వామి, పూర్వపు డీసీఓలు ప్రభాకర్‌రెడ్డి, పుల్లప్పలు సహకార చట్టం, సొసైటీల నిబంధనలు, ఆనలైన నిర్వహణ, ఆనలైన ఆడిట్‌పై వివరించారు. కార్యక్రమంలో ఆర్‌సీటీసీ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు, అధికారులు రాజారెడ్డి, మురళీమోహన, డీసీఎంఎస్‌ జిల్లా మేనేజర్‌ విజయ్‌భాస్కర్‌, నూతనంగా నియమితులైన సొసైటీల చైర్మన్లు, సీఈఓలు, పర్సన ఇంచార్జిలు, సహకార శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 12:07 AM