Share News

రహదారులు అధ్వానం

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:10 AM

బొమ్మనహాళ్‌ నుంచి బళ్లారికి ఉన్న 18 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో వాహనాల్లో ప్రయాణానికి కనీసం గంట సమ యం పడుతోంది

రహదారులు అధ్వానం
అధ్వానంగా ఉన్న బొమ్మనహాళ్‌ రోడ్డు

బొమ్మనహాళ్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): బొమ్మనహాళ్‌ నుంచి బళ్లారికి ఉన్న 18 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో వాహనాల్లో ప్రయాణానికి కనీసం గంట సమ యం పడుతోంది. ఈ రోడ్డు రెండు కిలోమీటర్లు అనంతపురం జిల్లాలో.. 16 కిలోమీటర్లు కర్ణాటక పరిధిలోని బళ్లారి జిల్లా పరిధిలో ఉండటంతో.. ఇరు జిల్లాల అధికారులు, పాలకులు ఈ సమస్య గురించి పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డుఎక్కడ చూసిన గుం తలే. ప్రస్తుతం వానలు వస్తుండటంతో రోడ్లు నీటి మడుగులను తలపిస్తున్నాయి. బొమ్మనహాళ్‌ మండలంలో వివిధ ప్యాక్టరీలకు భారీ లారీలు, ట్రాక్టర్లు ఈ రోడ్డు పై వెళ్తుండటంతో.. అది పూర్తిగా ధ్వంసమైం ది. బొమ్మనహాళ్‌, కణేకల్లు మండలాల నుంచి బళ్లారిలోని విమ్స్‌కు రోజూ అనేక మంది రోగులు వెళ్తుంటారు. ఈ రోడ్డు బాగలేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అనంతపురం, బళ్లారి జిల్లా అధికారులు స్పందించి.. ఈ సమస్యను పరిష్కరించాలని మండల వాసులు కోరుతున్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:11 AM