కుంటను తలపిస్తున్న రహదారి
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:47 PM
వజ్రకరూరు మండలంలోని కొనకొండ్లలోని హోతూరుకు వెళ్లే రహదారిపై భారీగా నీరు నిల్వ ఉంటూ.. కుంటను తలపిస్తోంది.
వజ్రకరూరు (ఉరవకొండ), నవంబరు 17(ఆంధ్రజ్యోతి): వజ్రకరూరు మండలంలోని కొనకొండ్లలోని హోతూరుకు వెళ్లే రహదారిపై భారీగా నీరు నిల్వ ఉంటూ.. కుంటను తలపిస్తోంది. ఎగువ భాగాన నాగలచెరువు తూము ఎత్తడంతో చెరువు నీరు అంతా వంక, కాలువల ద్వారా ఇలా రోడ్డు పైకి చేరుతోంది. దీంతో ఈ మార్గం ద్వారా వెళ్లే చాయాపురం, పొట్టిపాడు, హోతూరు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు.