Share News

రోడ్డుని కప్పేసిన కంపచెట్లు

ABN , Publish Date - Sep 08 , 2025 | 12:06 AM

మండలం కమ్మూరు గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు భారీగా పెరిగాయి.

రోడ్డుని కప్పేసిన కంపచెట్లు
రోడ్డు మలుపు వద్ద పెరిగిన ముళ్లకంపలు

కూడేరు, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలం కమ్మూరు గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు భారీగా పెరిగాయి. అనంతపురం- బళ్లారి ప్రధాన రహదారి నుంచి కమ్మూరు వరకు ఉన్న దాదాపు రెండు కిలోమీటర్ల రహదారి మొత్తం పరిస్థితి ఇలాగే ఉంది. ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు ద్విచక్రవాహనాలు, ఆటోల్లో ప్రయాణం సాగిస్తున్నారు. మలపులు ప్రాంతంలో ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోవడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Sep 08 , 2025 | 12:06 AM