Share News

అన్నం ఉడకలేదు.. కూరలు రుచి లేవు

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:49 PM

‘ అన్నం సరిగా ఉడకలేదు .. కూరలు రుచే లేవు. గడ్డిలా పడేస్తే తింటారులే అనుకున్నారా .. మీ పిల్లలకు ఇలాంటి అన్నమే పెడతారా... మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ’ అంటూ రాష్ట్ర ఆహార కమిషన సభ్యురాలు గంజిమాలదేవి మండలంలోని కాలువపల్లి ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజన ఏజెన్సీపై మండిపడ్డారు...

అన్నం ఉడకలేదు.. కూరలు రుచి లేవు
కాలువపల్లి : భోజనాన్ని రుచి చూస్తున్న గంజిమాలు దేవి

బెళుగుప్ప, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ‘ అన్నం సరిగా ఉడకలేదు .. కూరలు రుచే లేవు. గడ్డిలా పడేస్తే తింటారులే అనుకున్నారా .. మీ పిల్లలకు ఇలాంటి అన్నమే పెడతారా... మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ’ అంటూ రాష్ట్ర ఆహార కమిషన సభ్యురాలు గంజిమాలదేవి మండలంలోని కాలువపల్లి ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజన ఏజెన్సీపై మండిపడ్డారు. గురువారం ఆమె ఆ గ్రామంలో పర్యటించారు. రెండు ప్రభుత్వ చౌకధాన్యపు డిపోలు, అంగనవాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. రెండు డిపోలనూ సక్రమంగా నిర్వహించడం లేదని, వెంటనే కేసులు నమోదు చేయాలని తహసీల్దార్‌ అనిల్‌ కుమార్‌, డీటీ మధు సూదనరావును ఆదేశించారు. అనంతరం ఆ గ్రామంలోని ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. వంటలు సరిగా లేవని ఏజెన్సీపై మండిపడ్డారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం నాణ్యతతో కూడిన మెను అందించేందుకు చాలా డబ్బు వెచ్చిస్తోందని, ఎందుకు సక్రమంగా అమ లు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి, ఎంఈ వో హరికృష్ణ, హెచఎం ఉషా రాణి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమాదేవి, వీఆర్వో మధు ఉన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 11:50 PM