Share News

పిల్లర్లకే పరమితం

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:29 AM

మండలంలోని ఉప్పరహాళ్‌లో చెత్తతో సంపద కేంద్రం నిర్మాణం పిల్లర్ల దశలోని నిలిచిపోయింది. 2018లో నాటి టీడీపీ ప్రభుత్వం రూ.5లక్షలతో ఈ పనులను ప్రారంభించింది.

పిల్లర్లకే పరమితం
ఉప్పరహాళ్‌లో ఆగిన చెత్తతో సంపద కేంద్ర నిర్మాణం

బొమ్మనహాళ్‌, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉప్పరహాళ్‌లో చెత్తతో సంపద కేంద్రం నిర్మాణం పిల్లర్ల దశలోని నిలిచిపోయింది. 2018లో నాటి టీడీపీ ప్రభుత్వం రూ.5లక్షలతో ఈ పనులను ప్రారంభించింది. ఆ పనులు కాంట్రాక్టర్‌ పిల్లర్ల దశ వరకు చేపట్టారు. అనంతరం 2019లో వైసీపీ అధికారంలోకి రావడం.. బిల్లులు రాకపోవడంతో ఆ పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది అయినా.. సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకోవడంతో ఆ నిర్మాణ పనులను పునః ప్రారంభించలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అర్ధాంతరంగా నిలిచిపోయిన చెత్తతో సంపద కేంద్రం పనులు పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Sep 01 , 2025 | 12:29 AM