పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలి
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:07 AM
పట్టణ విస్తీర్ణం పెరిగిందని, అందుకు తగ్గట్టు మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచాలని ఏఐటీయూసీ, సీఐటీయూసీ నాయకులు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మిదేవికి బుధవారం వినతి పత్రం అందజేశారు.
గుంతకల్లుటౌన, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): పట్టణ విస్తీర్ణం పెరిగిందని, అందుకు తగ్గట్టు మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచాలని ఏఐటీయూసీ, సీఐటీయూసీ నాయకులు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మిదేవికి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఏఐటీయూసీ మున్సిపల్ పారిశుధ్య కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు వీరభద్రస్వామి మాట్లాడుతూ... పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తూ మరణించిన ఐదుగురు, రిటైర్డైన ఎనిమిదిమంది కుటుంబ సభ్యులను వెంటనే విధుల్లో తీసుకోవాలన్నారు. వెంటనే కారుణ్య నియామకాలను చేపట్టాలన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సీఐటీయూ జిల్లా నాయకులు నరసయ్య, జగదీష్, ఏఐటీయూసీ నాయకులు ఈశ్వరయ్య, చిన్న కొండయ్య పాల్గొన్నారు.