Share News

గుంతలమయంగా జాతీయ రహదారి

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:52 AM

పాతగుంతకల్లులోని అంకోలా-నెల్లూరు జాతీయ రహదారి గుంతలమయమైంది. పాత శివాలయం వద్ద భారీ గుంతలు ఉన్నాయి

గుంతలమయంగా జాతీయ రహదారి

గుంతకల్లుటౌన, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): పాతగుంతకల్లులోని అంకోలా-నెల్లూరు జాతీయ రహదారి గుంతలమయమైంది. పాత శివాలయం వద్ద భారీ గుంతలు ఉన్నాయి. వాల్మీకి సర్కిల్‌, బీరప్ప సర్కిల్‌లోనూ గుంతలు పడ్డాయి. ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు వెళ్లలేని పరిస్థితులున్నాయి. భారీ వాహనాలు వచ్చినప్పుడు ద్విచక్రవాహనాలు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలను తప్పించే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి అధికారులు స్పందించి.. ఆ గుంతలను పూడ్చేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Aug 16 , 2025 | 12:52 AM