Share News

సామూహిక బిందుసేద్యం ప్రాజెక్టు పూర్తిచేయాలి

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:36 AM

నియోజకవర్గంలో రూ.842 కోట్లతో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించే సామూహిక బిందుసేద్యం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్‌ చేశారు.

సామూహిక బిందుసేద్యం ప్రాజెక్టు పూర్తిచేయాలి

ఉరవకొండ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో రూ.842 కోట్లతో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించే సామూహిక బిందుసేద్యం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్‌ చేశారు. మండలంలోని ఆమిద్యాల గ్రామంలో నిరుపయోగంగా పడి ఉన్న సామూహిక బిందుసేద్యం ప్రాజెక్టు పరికరాలను బుధవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో 2017లో ఈ ప్రాజెక్టును ప్రారంభిం చి 50 శాతం పనులు కూడా పూర్తి చేసిందన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును గాలికి వదిలేసిందన్నారు. జీడీపల్లి, పీఏబీఆర్‌ జలాశయాల ద్వా రా 1.67టీఎంసీల హంద్రీనీవా జలాలను ఎత్తిపోసి, ఈ ప్రాజెక్టు లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నా రు. డిస్రి్ట్రబ్యూటరీ పనులు పూర్తి చేయకపోవడం వల్ల హంద్రీనీవా కాలువ నీరు రైతు కళ్లముందే పారుతున్నా ఒక్క ఎకరా కు కూడా వాడుకోలేని పరిస్థితి ఉందన్నారు. మంత్రి సొంత నియోజకవర్గంపై దృష్టి సారించాలని, లక్షలాది రూపాయలు విలువ చేసే పరికరాలను సద్వినియోగం అయ్యేలా చూడాలని అన్నారు. ఆయన వెంట సీపీఐ నాయకులు మల్లికార్జున, రాజారెడ్డి, కేశవరెడ్డి, మల్లికార్జున ఉన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 12:36 AM