Share News

స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యం

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:34 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించాలని, ఇప్పటి నుంచే ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ భుజస్కంధాలపై వేసుకోవాలని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యం
ప్రమాణస్వీకారం చేయిస్తున్న విప్‌ కాలవ

రాయదుర్గం, నవంబరు14(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించాలని, ఇప్పటి నుంచే ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ భుజస్కంధాలపై వేసుకోవాలని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం మద్దానేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నూతన కన్వీనర్ల ప్రమాణస్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని శాంతినగర్‌ వద్ద ఉన్న ఎనటీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుం చి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పార్టీశ్రేణులు, నాయకులు బైక్‌ర్యాలీ నిర్వహిస్తూ.. మద్దానేశ్వరస్వామి ఆలయం వద్దకు చేరారు. ఈ సందర్భంగా కణేకల్లు మండల కన్వీనర్‌గా వన్నారెడ్డి, రాయదుర్గం పట్టణ కన్వీనర్‌గా బండి క్రిష్ణమూర్తి, డీ.హీరేహాళ్‌ మండల కన్వీనర్‌గా కాదలూరు మోహనరెడ్డి, గుమ్మఘట్ట కన్వీనర్‌గా కాలవ సన్నన్నలతో పాటు క్లస్టర్‌ ఇనఛార్జులు, బూత కన్వీనర్లతో విప్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్‌ హాజరయ్యారు. విప్‌ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా కలిసికట్టుగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో యువనాయకు డు కాలవ భరత, మార్కెట్‌యార్డ్‌ ఛైర్మెన హనుమంతరెడ్డి, కార్పోరేషన డైరెక్టర్లు పొరాళు పురుషోత్తం, నాగళ్లి రాజు, ఆనంద్‌రాజ్‌, నాయకులు గిరిమల్లప్ప, పసుపులేటి నాగరాజు, బలరాంరెడ్డి, కురుబ హనుమంతు, లాలెప్ప పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 12:34 AM