MLA ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - May 06 , 2025 | 11:40 PM
ప్రజా సమస్యలను నాయకులు, కార్యకర్తలు నేరుగా తన దృష్టికి తీసుకు రావాలనీ, వాటిని పరిష్కరించడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్పష్టం చేశారు
గాండ్లపెంట, మే 6(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను నాయకులు, కార్యకర్తలు నేరుగా తన దృష్టికి తీసుకు రావాలనీ, వాటిని పరిష్కరించడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక ఎస్‌ఆర్ ఫంక్షన హాల్‌లో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. గ్రామస్థాయిలో సమస్యలు పై కార్యకర్తలు ఆరా తీసి.. తన దృష్టికి తీసుకొని రావాలన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతికార్యకర్త పని చేయాలన్నారు. సమావేశంలో టీడీపీ కన్వీనర్ కొండయ్య, శివరామ్ ప్రతాప్, సింగ్ విండో మాజీ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, సర్పంచలు రహంతుల్లా, శివప్పనాయుడు, ఎంపీటీసీ జయరామక్రిష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ గంగరాజు, మాజీ సర్పంచ ప్రసాద్, ఆనంద్, అక్రమ్‌బాషా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.