ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:00 AM
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని రూపొందించిందని, దీన్ని ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయ రాం సూచించారు.
గుంతకల్లు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని రూపొందించిందని, దీన్ని ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయ రాం సూచించారు. శుక్రవారం స్థానిక టీడీపీ కా ర్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమా న్ని నిర్వహించి.. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దారు రమాదేవి, ఎంపీడీఓ దేవదాసు, టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణస్వామి, సింగిల్ విండో సొసె ౖటీ అధ్యక్షుడు తలారి మస్తానప్ప పాల్గొన్నారు.