Eruvaka ఉత్సాహంగా ఏరువాక పౌర్ణమి
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:33 PM
పలు ప్రాంతాల్లో రైతులు తమతమ పొలాల్లో ఏరువాక పౌర్ణమి పూజలను ఉత్సాహంగా నిర్వహించారు. కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రంలో ఏరువాక పౌర్ణమి పూజలను సమన్వయ కర్త డాక్టర్ చండ్రాయుడు, ఏడీఏ ఎల్లప్ప ప్రారంభించారు
ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్ : పలు ప్రాంతాల్లో రైతులు తమతమ పొలాల్లో ఏరువాక పౌర్ణమి పూజలను ఉత్సాహంగా నిర్వహించారు. కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రంలో ఏరువాక పౌర్ణమి పూజలను సమన్వయ కర్త డాక్టర్ చండ్రాయుడు, ఏడీఏ ఎల్లప్ప ప్రారంభించారు. అలాగే పొలంలో ఎద్దులకు పూజలు చేశారు. పెద్దవడుగూరులో నిర్వహించిన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణయాదవ్, నియోజకవర్గ అధ్యక్షుడు ఆదినారాయణ, అల్లాబకాష్, పలువురు రైతులు పాల్గొన్నారు. బొమ్మనహాళ్ మండలంలోని శ్రీధరఘట్ట, గోవిందవాడ, ఉంతకల్లు, నేమకల్లు తదితర గ్రామాల్లో ఎద్దులకు అందంగా అలంకరించి ఊరేగించారు. వాటికి పోటీలు నిర్వహించారు. శ్రీధరఘట్టలో విజేత వృషభాల యజమానికి టీడీపీ మండల కన్వీనర్ బలరాంరెడ్డి బహుమతి అందజేశారు. రాయదుర్గం మండలంలోని మారెంపల్లి, కొండాపురం, మల్కాపురం, రేకులకుంట తదితర గ్రామంలో ఏరువాక పున్నమి పూజలు చేసి.. పొల్లాల్లో విత్తనాలు వేశారు. అనంతరం గ్రామాలలో ఎద్దులకు పరుగుపందెం నిర్వహించి.. గెలుపొందిన వృషభాలను ఆయా గ్రామాల్లో ఊరేగించారు.