వ్యవసాయానికి పూర్వవైభవం
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:39 AM
చంద్రబాబు నాయకత్వంలోని ఎనడీఏ కూటమి పాలనలో వ్యవసాయరంగానికి పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్యే, విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు.
రాయదుర్గంరూరల్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు నాయకత్వంలోని ఎనడీఏ కూటమి పాలనలో వ్యవసాయరంగానికి పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్యే, విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని టీ వీరాపురంలో శుక్రవారం ఆయన రైతన్నా మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. రైతు కుటుంబాలతో మాట్లాడుతూ సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కురుబ హనుమంతు, సర్పంచులు వన్నూరుస్వామి, రాజశేఖర్‌రెడ్డి, వన్నూరుస్వామి, టీడీపీ నాయకులు కాటా వెంకటేశులు, రామస్వామి, గంగాధర్‌శెట్టి, గంగప్ప, సుంకప్ప, సోమశేఖర్, వీరస్వామి, ప్రసాద్, లచ్చన్నచౌదరి, మాజీ జడ్పీటిసి కుమార్ పాల్గొన్నారు.