Share News

భోజనం అధ్వానం..!

ABN , Publish Date - Sep 09 , 2025 | 12:14 AM

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లోని గ్రామీణ విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడకూడదని .. మధ్యాహ్న భోజనాన్ని వారికి కూడా అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

భోజనం అధ్వానం..!
ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని తింటున్న విద్యార్థులు

బొమ్మనహాళ్‌, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లోని గ్రామీణ విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడకూడదని .. మధ్యాహ్న భోజనాన్ని వారికి కూడా అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఏజన్సీల నిర్లక్ష్యం వల్ల చాలా మంది విద్యార్థులు కళాశాలలో భోజనం తినడం లేదు. ఇంటి నుంచే బాక్సులు తెచ్చుకుంటున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆంధ్రజ్యోతి సోమవారం విజిట్‌ చేసింది. చాలామంది విద్యార్థులు ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకొని తింటున్నారు. మరి కొందరు భోజనం తినకుండా పస్తులు ఉంటున్నారు. సోమవారం మెనూ ప్రకారం తెల్ల అన్నం, వెజిటబుల్‌ కర్రీ, గుడ్డు, చిక్కీ వడ్డించాల్సి ఉంది. అయితే విద్యార్థులకు తెల్ల అన్నం, ఆలుగడ్డ, వంకాయతో చేసిన కర్రీ, గుడ్డు, చిక్కీ ఇచ్చారు. 464 మంది విద్యార్థులకు గాను కేవలం 270 మంది మాత్రమే హాజరయ్యారు. ఇందులోనూ కొందరు ఇంటి నుంచే బాక్సులు తెచ్చుకోగా.. మరి కొందరు భోజనానికి ఇంటికి వెళ్తున్నారు. వారిని ఆంధ్రజ్యోతి పలకరించగా.. ‘ మధ్యాహ్న భోజనం కాలేజ్‌లో పెడితే మొదట చాలా సంతోషపడ్డాం. కొత్తలో బాగా ఉండేది. రానురాను అధ్వానంగా మారింది. కూర, పుప్పు చాలా కారంగా చేస్తున్నారు. నీళ్లగా చేస్తున్నారు. కూరగాయలు వాడటం లేదు. అన్నం సరిగా ఉడికించడం లేదు. కిచిడి, పులిహోర కూడా అంతే. ఈ భోజనం బాగలేదని కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశాము. అయినా మార్పు లేదని వాపోయారు. ’ అని వాపోయారు.

Updated Date - Sep 09 , 2025 | 12:14 AM