Share News

JVV: తొలి సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:02 AM

ఆనాటి సమాజాన్ని పట్టి పీడించిన మూఢనమ్మకాల నిర్మూలనకు కృషిచేసిన తొలి సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.

JVV: తొలి సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం
Acharya Rajapalem Chandrasekhar Reddy speaking

అనంతపురం కల్చరల్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఆనాటి సమాజాన్ని పట్టి పీడించిన మూఢనమ్మకాల నిర్మూలనకు కృషిచేసిన తొలి సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు 177వ జయంతిని పురస్కరించుకుని జన విజ్ఞాన వేదిక(జేవీవీ) నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌లో ’కందుకూరి వీరేశలింగం జీవితం-స్ఫూర్తి’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు రాచపాలెం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కొంతమంది మహానుభావులను గుర్తుచేసుకుంటే వారు చెప్పిన మాటలు గుర్తొస్తాయని, ఆ రకంగా వీరేశలింగం పంతులు చెప్పిన ‘చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్న మాట నేటికీ గుర్తొస్తుంటుందన్నారు. కార్యక్రమంలో జేవీవీ సమత జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ ప్రసూన, గాంగేనాయక్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుక, సాకే భాస్కర్‌, రోగప్ప, రామిరెడ్డి, ముత్యాలు, ప్రసాద్‌రెడ్డి, తిరుపాలు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:02 AM