ముగిసిన ఉరుసు
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:30 PM
మండలంలోని వీ కొత్తకోటలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బడేషావలి ఉరుసు ఉత్సవాలు గురువారంతో ముగిశాయి.
విడపనకల్లు, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని వీ కొత్తకోటలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బడేషావలి ఉరుసు ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ ఉత్సవాలులో భాగంగా బుధవారం సాయం త్రం స్వామి వారి సమాధిని ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున మూడు గంటల వరకూ ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి వారి షంషేర్‌ను గుర్రంపై ఉంచి ఊరేగించారు.