Share News

పొంచి ఉన్న ప్రమాదం

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:17 AM

మండలంలోని బొల్లనగుడ్డం గ్రామ శివారులో త్రీఫేస్‌ విద్యుత వైర్లు తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఉన్నాయి

పొంచి ఉన్న ప్రమాదం
తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత తీగలు

బొమ్మనహాళ్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొల్లనగుడ్డం గ్రామ శివారులో త్రీఫేస్‌ విద్యుత వైర్లు తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఉన్నాయి. పొలాల్లోకి వ్యవసాయ సామగ్రిని తీసుకెళ్లే సమయంలో ఎప్పుడు .. ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ తీగలను సరి చేయాలని లైనమనను కోరితే డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడని స్థానిక రైతుల గోపాల్‌ ఆరోపించారు. దీనిపై బొమ్మనహాళ్‌ విద్యుత ఏఈఈ లక్ష్మిరెడ్డిని వివరణ కోరగా.. త్రీఫేస్‌ వైర్లు కిందకు ఉన్నట్లు తన దృష్టికి రాలేదని, వాటిని పరిశీలించి మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని తెలిపారు

Updated Date - Nov 21 , 2025 | 12:17 AM