పొంచి ఉన్న ప్రమాదం
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:03 AM
మండలంలోని రాయలప్పదొడ్డి సబ్ స్టేషన నుంచి బొమ్మగానిపల్లి వెళ్లే 11 కేవీ విద్యుత లైన స్తంభాన్ని రెండు నెలల క్రితం ఒక ట్రాక్టర్ ఢీకొంది
బ్రహ్మసముద్రం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని రాయలప్పదొడ్డి సబ్ స్టేషన నుంచి బొమ్మగానిపల్లి వెళ్లే 11 కేవీ విద్యుత లైన స్తంభాన్ని రెండు నెలల క్రితం ఒక ట్రాక్టర్ ఢీకొంది. దీంతో ఆ విద్యుత స్తంభం పూర్తిగా పక్కకు ఒరిగింది. ప్రధాన రోడ్డు పక్కనే ఈ స్తంభం ఉండటంతో ఏ క్షణంలోనైనా అది కూలిపోయే ప్రమాదముంది. విద్యుత అధికారులు స్పందించి.. ప్రమాదం జరగక ముందే ఆ స్తంభాన్ని సరిచేయాలని వాహనదారులు కోరుతున్నారు.