ఏఓను బదిలీ చేయాలి
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:17 AM
కొన్ని సంవత్సరాలుగా మండల వ్యవసాయాధికారి కృష్ణకిషోర్‌రెడ్డి తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని, పలుమార్లు సూచించినా.. ఫిర్యాదులు చేసినా అతనిలో మార్పు రాలేదని, అతన్ని బదిలీ చేయాలని రాయదుర్గం మార్కెట్‌యార్డ్ ఛైర్మన హనుమంతరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ మోహనరెడ్డి, రైతులు డిమాండ్ చేశారు.
డీ.హీరేహాళ్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కొన్ని సంవత్సరాలుగా మండల వ్యవసాయాధికారి కృష్ణకిషోర్‌రెడ్డి తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని, పలుమార్లు సూచించినా.. ఫిర్యాదులు చేసినా అతనిలో మార్పు రాలేదని, అతన్ని బదిలీ చేయాలని రాయదుర్గం మార్కెట్‌యార్డ్ ఛైర్మన హనుమంతరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ మోహనరెడ్డి, రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తాళం వేసిన మండల వ్యవసాయ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. నిత్యం మండల వ్యవసాయాధికారి విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని, దీంతో అతని కార్యాలయం ఎప్పుడూ మూసి ఉంటోందని వాపోయారు. మండలంలో 90 శాతంపైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డారని, వ్యవసాయాధికారి అందుబాటులో లేకుంటే ఇక రైతుల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము ఫోన చేసినా కనీసం లిఫ్ట్ కూడా చేయరని అన్నారు. పలుమార్లు ధర్నాలు చేసినా ఆయనలో మార్పు రాలేదని, ఉన్నతాధికారులు ఆయన్ను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.