అభివృద్ధే కూటమి లక్ష్యం: విప్
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:20 AM
రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, అందులో భాగంగా వేలాది టీచర్ పోస్టులను భర్తీ చేసి ఇటు నిరుద్యోగులు .. అటు విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిందని విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు
డీ.హీరేహాళ్, అక్టోబరు13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, అందులో భాగంగా వేలాది టీచర్ పోస్టులను భర్తీ చేసి ఇటు నిరుద్యోగులు .. అటు విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిందని విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. మండలంలో మురడి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలను సోమవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. జిల్లాలో 755 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించగా అందులో 247 మంది 32.7 శాతం ఉపాధ్యాయులను ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే నియమించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కొత్త ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మార్కెట్ యార్డ్ ఛైర్మన హనుమంతరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన డైరెక్టర్ నాగళ్లి రాజు, మండల కన్వీనర్ మోహనరెడ్డి, క్లస్టర్ ఇనఛార్జ్ గంగాధర, ఆనంద్‌రెడ్డి, ఎంపీడీఓ దాసనాయక్, దొడఘట్ట రామాంజినేయులు, చన్న, వీర పరంధామా పాల్గొన్నారు.