ఆ ఉపాధ్యాయుడు మాకొద్దు సార్..!
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:58 PM
తమ గ్రామంలోని పాఠశాలకు ఉపాధ్యాయుడిగా శివశంకర్ ను నియమించరాదని మండలంలోని మహంతపురం గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
కుందుర్పి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): తమ గ్రామంలోని పాఠశాలకు ఉపాధ్యాయుడిగా శివశంకర్ ను నియమించరాదని మండలంలోని మహంతపురం గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు మంగళవారం మండల విద్యాశాఖాధికారులు తిప్పేస్వామి, శంకరప్పకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. తమ గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా శివశంకర్ 2021లో విధులు నిర్వహించారని, సక్రమంగా పాఠశాలకు వచ్చేవారు కాదని, విధులను నిర్లక్ష్యం చేసేవారని వాపోయారు. దీంతో విద్యార్థులు చదువులో చాలా వెనకబ్డారన్నారు. నేడు మళ్లీ శివశంకర్ బదిలీపై తమ పాఠశాలకు వస్తున్నారని, ఆయన్ను మరో పాఠశాలకు బదిలీ చేయాలని, ఆ ఉపాధ్యాయుడు వద్దని తేల్చిచెప్పారు.