అభిమానులకు కృతజ్ఞతలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:31 PM
అనంతపురంలో బుధవారం నిర్వహించిన సూపర్ సిక్స్ .. సూపర్ హిట్ సభ విజయవంతం కావడానికి సహకరించిన అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం స్థానిక ప్రజావేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
కళ్యాణదుర్గం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో బుధవారం నిర్వహించిన సూపర్ సిక్స్ .. సూపర్ హిట్ సభ విజయవంతం కావడానికి సహకరించిన అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం స్థానిక ప్రజావేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బీటీపీ, హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ ఏ, బీ ద్వారా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఈ సంవత్సరంలోనే నీరు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని సీఎం చంద్రబాబు, అలాగే నియోజకవర్గంలో రెండు వేలు కిలోమీటర్ల రహదారులు ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్ హామీ ఇవ్వడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి భారీఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు ఎన్నడూలేని విధంగా ప్రజలు తండోప తండాలుగా తరలివెళ్లారన్నారు. ఈ నియోజకవర్గం నుంచే సుమారు 20 వేల మంది తరలివెళ్లి మన బలాన్ని చాటిచెప్పామన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ టీడీపీ అభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చౌళం మల్లికార్జున, వాల్మీకి కార్పొరేషన స్టేట్ డైరెక్టర్ వైపీ రమేష్, టీడీపీ మండల కన్వీనర్లు గోళ్ల వెంకటేశులు, పాలబండ్ల శ్రీరాము లు, మార్కెట్ యార్డు ఛైర్మన లక్ష్మీదేవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.