రుణాల కోసం కౌలు రైతుల ధర్నా
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:53 PM
తమకు ఎటువంటి జామీన లేకుండా పంట రుణాలు మంజూరు చేయాలని స్థానిక కెనరా బ్యాంక్ ఎ దుట సీపీఐ, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో కౌలు రైతులు సోమ వారం ధర్నా నిర్వహించారు.
విడపనకల్లు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): తమకు ఎటువంటి జామీన లేకుండా పంట రుణాలు మంజూరు చేయాలని స్థానిక కెనరా బ్యాంక్ ఎ దుట సీపీఐ, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో కౌలు రైతులు సోమ వారం ధర్నా నిర్వహించారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఉన్నా బ్యాంక్ అధికారులు రుణాలు మంజూరు చేయటం లేదన్నారు. ఎటువంటి జామీన లేకుండా ఎకరాకు రూ. 30వేలు రుణాన్ని మంజూరు చేయాలన్నారు. కెనరా బ్యాంక్ మేనేజర్‌కు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకుడు ఎంబీ చెన్నరాయుడు, సీపీఎం నాయకులు బాల రంగయ్య, వెంకటేశులు, రంగారెడ్డి, వనజాక్షి పాల్గొన్నారు.